నా చిట్టి తల్లి నా చిన్నారి భార్గవి ని అప్పుడే స్కూల్ కు పంపలంటే నాకు భయం గా ఉంది, ఉదయం నుంచి నాతో భాను ఈ మాట 100 సార్లు అని ఉంటుంది తను ఆ మాట అనడం లో నాకు ఆక్స్చర్యం కలగా లేదు. ఎందు కంటే ఈ రోజు ఉదయం న్యూస్ పేపర్ చూడగానే ప్రతి ఒక్కరికి షాక్ కల్గించే వార్త: హైదరాబాద్ లోని ఉప్పల్ రింగ్ రోడ్ ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు బాలికల మృతి, స్కూల్ కు వెళ్లి వస్తున్న ఇద్దరు చిన్నారులు ఓ త్రాగుబోతు డ్రైవర్ నిర్వాకం తో తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ప్రతి తల్లి తండ్రి టం తమ పిల్లల గురించి ఎన్నో కలలు కంటూ తమ జీవితంలో తాము కొల్పొయినవి వారి ద్వార నెరవేర్చు కోవాలని అనుకుంటూ ఉంటారు. తమ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని, సమాజం లో ఉన్నతమైన స్థానం లో నిలవాలని అనుకుంటారు, కోటి ఆశల తో వారి వారి పిల్లలను schools కు పంపించుతారు కాని యిలాంటి అనుకోని సంఘటనలతో తమ ఆశలు ఆవిరి అయిపోతు ఉంటె చూస్తూ ఉండటమేనా? మనవంతు కర్తవ్యం గా మనం ఏమిచేయాలి ? తప్పు ఎవరిదీ ? మన ట్రాపిక్ వ్యవస్సా అద్వాన సితికి నిదర్శనం నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం, ఆభం శుబం తెలియని లేత మొగ్గలను బాల్యం లోనే చిదిమేసే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు ? తమ తప్పిదము ఏమి లేకుండానే తమ జీవించే హక్కు ను ఈ పిల్లలు కోల్పోయరంటే యెంతో వేదన చెందలిసిన విషయం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది, ఆ హక్కు ను కాలరాసే అధికారం ఎవ్వరికి లేదు.నిర్లక్ష్యం తో వ్యవరించి చిన్నారుల ప్రాణాలను తీసుకున్న డ్రైవర్ కు తగిన శిక్ష విదించాలి, ట్రాపిక్ రూల్స్ ను కటిన తరం చేయాలి, ముఖ్యం గా ట్రాపిక్ పోలీసు ల లోని లంచగొండితనం ని అంతం వొందించాలి, ప్రతి ఒక్కరు ట్రాపిక్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలి, మద్యం త్రాగి డ్రైవింగ్ చేసే వారి ఫై కటిన చర్యలు తీసుకోవాలి వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలి, మెయిన్ రోడ్ లకు దగ్గరగా ఉండే schools కు పర్మిషన్ ఇవ్వకూడదు, అలాంటివాటి గుర్తించి వాటిని నివాస ప్రాంత లకు దగ్గర గా తరలించాలి, అప్పుడే ఇలాంటివి ఇక ముందు జరుగవు అని నేను అనుకుంటూ ఉంటె మా భాను నా దగ్గరకు వచ్చి ఏమండి మన పాపా ను మన ఇంటి పక్క నే ఉన్న స్కూల్ లొనే చేరుచుద మండి అనటం తో నేను ఈ లోకం లొకి వచ్చాను.